ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు నెలల క్రితం నీటిలో పడ్డ ఐఫోన్.. ఇప్పుడు బయటకు తీయగా..

ABN, First Publish Date - 2021-03-09T13:15:02+05:30

కెనడాలోని ఓ సరస్సులో ఆరు నెలల క్రితం పడిన ఫోన్‌ను తాజాగా బయటకు తీయగా ఇప్పటికీ పనిచేస్తుండటం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిల్లివాక్: కెనడాలోని ఓ సరస్సులో ఆరు నెలల క్రితం పడిన ఫోన్‌ను తాజాగా బయటకు తీయగా ఇప్పటికీ పనిచేస్తుండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ఫోన్ యాపిల్ సంస్థకు చెందినదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. చిల్లివాక్ నగరంలో గతేడాది సెప్టెంబర్‌లో ఓ యువతి చేతిలో నుంచి ఐఫోన్ 11 మోడల్ అనుకోకుండా హ్యారిసన్ సరస్సులో పడిపోయింది. చేసేదేం లేక యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఫ్రీడైవర్ జంట ఈ సరస్సు అడుగున ఉన్న చెత్తను క్లీన్ చేస్తుంటారు. ఇటీవల వారు చెత్తను క్లీన్ చేస్తుండగా వారికి రెండు ఫోన్లు దొరికాయి. 


రెండు ఫోన్లలో ఒక ఫోన్ స్విచ్‌ఆన్ అవలేదని, యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ మాత్రం వెంటనే స్విచాన్ అయినట్టు జంట తెలిపింది. ఆ ఫోన్ యజమాని వ్యాంకోవర్‌కు చెందిన యువతి అని తెలుసుకుని ఫోన్‌ను ఆమెకు అప్పగించారు. తన ఫోన్ మళ్లీ తన వద్దకు వస్తుందని అనుకోలేదంటూ యువతి ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. ఐఫోన్ 11 మోడల్‌కు ఐపీ68(ఇంగ్రెస్ ప్రొటెక్షన్) రేటింగ్ ఉంది. అంటే.. ఈ మోడల్ ఫోన్ నీటిలో(రెండు మీటర్ల లోతు) పడినా అరగంట వరకు ఎటువంటి డ్యామేజ్ కాదు. కానీ తాజాగా దొరికిన ఫోన్ ఆరు నెలలు గడిచినా స్విచాన్ అవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Updated Date - 2021-03-09T13:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising