ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెప్పాపెట్టకుండా పని మొదలెట్టారని.. వర్కర్స్‌కు షాకిచ్చిన మహిళ!

ABN, First Publish Date - 2021-11-01T02:50:49+05:30

చెప్పాపెట్టకుండా పనిమొదలెట్టారనే కోపంతో రెచ్చిపోయిన ఓ మహిళ.. వర్కర్లకు ఊహించని షాకిచ్చింది. ఆమె చేసిన పనికి ఇద్దరు పనివాళ్లు ఏకంగా 26 అంతస్తుల ఎత్తు నుంచి వేళాడాల్సి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: చెప్పాపెట్టకుండా పనిమొదలెట్టారనే కోపంతో రెచ్చిపోయిన ఓ మహిళ..  వర్కర్లకు ఊహించని షాకిచ్చింది. ఆమె చేసిన పనికి ఇద్దరు పనివాళ్లు ఏకంగా 26 అంతస్తుల ఎత్తు నుంచి వేళాడాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ అక్కడి ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. థాయ్‌ల్యాండ్‌లోని ఓ ఆకాశహర్మం అద్దాలను శుభ్రం చేసేందుకు పనివాళ్లు రంగంలోకి దిగారు. అయితే..ఈ పని అంత ఆషామాషీ వ్యవహారం కాదు. భవనం నుంచి తాడుతో వేళ్లాడుతూ ఒక్కో అంతస్తులో ఉన్న అద్దాలను తుడవాల్సి ఉంటుంది. అంత ఎత్తునుంచి వారు కిందపడకుండా అడ్డుకునేది వారు వేళాడుతున్న తాళ్లు మాత్రమే. అయితే..తనకు చెప్పకుండా పని ప్రారంభించారన్న కోపంలో ఆ యువతి ఏకంగా ఆ తాడునే కోసేసింది. దీంతో.. వారు  25వ అంతస్తు వద్ద చాలా సేపు అలావేళాడుతూ ఉండిపోవాల్సి వచ్చింది. కాగా.. బాధితులను రక్షించిన అనంతరం పోలీసులు ఆ యువతిని అరెస్టు చేశారు. హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-11-01T02:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising