ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30ఏళ్ల తర్వాత.. ఆమె తన గోర్లను కత్తిరించుకుంది!

ABN, First Publish Date - 2021-04-08T01:36:59+05:30

అయన్నా విలియమ్స్.. ఈ పేరును ఇంతకు ముందు వినే ఉంటారు. అతి పొడవైన గోర్లు కలిగిన మహిళగా 2017లో ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో ఆమె నిలిచారు. తాజాగా అయన్నా విలియమ్స్.. తన రికార్డును తానే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యూస్టన్: అయన్నా విలియమ్స్.. ఈ పేరును ఇంతకు ముందు వినే ఉంటారు. అతి పొడవైన గోర్లు కలిగిన మహిళగా 2017లో ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో ఆమె నిలిచారు. తాజాగా అయన్నా విలియమ్స్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని హ్యూస్టన్ నగరానికి చెందిన అయన్నా విలియమ్స్.. తన చేతివేళ్లకు ఉన్న గోర్లను గత 30ఏళ్లుగా పెంచుతున్నారు. ఈ క్రమంలో వాటి పొడవు 733.55 సెంటీమీటర్లకు చేరుకుంది. అయితే తాజాగా ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు దశాబ్దాలపాటు అపురూపంగా పెంచుకున్న గోర్లను తొలగించుకున్నారు. అంతకంటే ముందు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు.. ఆమె గోర్ల కొలతలను మరోసారి తీసుకున్నారు. అంతేకాకుండా అయన్నా విలియమమ్స్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నారని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు ప్రకటించారు. దీంతో ఆమె ఉద్వేగానికి గురయ్యారు. 30ఏళ్లపాటు అపురూపంగా పెంచుకున్న గోర్లన కోల్పోతున్నానే బాధను.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాననే సంతోషాన్ని ఆమె ఏకకాలంలో అనుభవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-08T01:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising