ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికన్ల కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం: బైడెన్

ABN, First Publish Date - 2021-02-26T19:10:18+05:30

కరోనా టీకాలను తేలికగా తీసుకుంటున్న అమెరికన్ల కోసం వాటిపై అవగాహన కలిగించే ఉద్దేశంతో త్వరలోనే ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా టీకాలను తేలికగా తీసుకుంటున్న అమెరికన్ల కోసం వాటిపై అవగాహన కలిగించే ఉద్దేశంతో త్వరలోనే ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ తెలియజేశారు. తన పరిపాలన విభాగం ప్రస్తుతం ఈ విషయమై కసరత్తు చేస్తున్నట్లు అధ్యక్షుడు తెలిపారు. త్వరలోనే ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ద్వారా వ్యాక్సిన్లపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తాము నిర్వహించబోయే ఈ ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని బైడెన్ స్పష్టం చేశారు. కరోనా టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వ్యాక్సిన్లు తీసుకునేలా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. 


ఇప్పటికే దేశవ్యాప్తంగా 5లక్షలకు పైగా మంది మహమ్మారికి బలయ్యారని, మునుముందు ఈ సంఖ్య పెరగకుండా ఉండాలంటే టీకాలే శరణ్యమని అన్నారు. కనుక ప్రజలు వ్యాక్సిన్ల పట్ల నిర్లక్ష్యం చూపకపోవడం మంచిదన్నారు. కరోనా నుంచి మనల్ని కాపాడే ఏకైక ఆయుధం వ్యాక్సిన్ మాత్రమేనని ఈ సందర్భంగా బైడెన్ స్పష్టం చేశారు. అందుకే అమెరికన్లలో టీకాలపై ఉన్న అపోహలను తొలగించి, వాటినే తీసుకునేలా ప్రోత్సహించడం కోసం ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-02-26T19:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising