ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వదేశానికి వచ్చేందుకు విముఖత చూపుతున్న ప్రవాసులు

ABN, First Publish Date - 2021-03-02T12:29:39+05:30

దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల కారణంగా విదేశాల నుంచి స్వదేశానికి వచ్చేందుకు ప్రవాసులు విముఖత చూపుతున్నారు. యూఏఈ నుంచి భారత్‌కు విమాన టికెట్ అతి తక్కువ ధరకు లభిస్తున్నా అనేక సార్లు సొంత ఖర్చులతో కొవిడ్-19 టెస్ట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల కారణంగా విదేశాల నుంచి స్వదేశానికి వచ్చేందుకు ప్రవాసులు విముఖత చూపుతున్నారు. యూఏఈ నుంచి భారత్‌కు విమాన టికెట్ అతి తక్కువ ధరకు లభిస్తున్నా అనేక సార్లు సొంత ఖర్చులతో కొవిడ్-19 టెస్ట్ చేయించుకోవాల్సి ఉండటంతో ప్రవాసీయులు భారత్ వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. రెండు వారాల ట్రిప్ కోసం యూఏఈ నుంచి భారత్‌కు రావాలంటే.. భారత్ రాక ముందు కొవిడ్-19 నెగిటివ్ రిపోర్ట్ ఎయిర్ సువిదా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 


భారత్‌కు వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టులో మరోమారు టెస్ట్ చేయించుకోవాలి. మళ్లీ వారం రోజుల తర్వాత కొవిడ్-19 పరీక్ష చేయించుకోవాలి. ఇక రెండు వారాల తర్వాత తిరిగి మళ్లీ యూఏఈకి వెళ్లేటప్పుడు ఒకసారి, యూఏఈలో విమానం దిగిన తర్వాత మరోసారి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా కనీసం ఐదు సార్లు కొవిడ్-19 టెస్ట్ చేయించుకునేలా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో యూఏఈ నుంచి భారత్‌కు విమాన టికెట్ ధర దాదాపు 600 దిర్హామ్‌లు ఉండేది. కానీ ఇప్పుడు 200 నుంచి 300 దిర్హామ్‌లకే టికెట్ లభిస్తోంది. విమాన టికెట్ రేటు తగ్గినప్పటికి, కొవిడ్-19 టెస్ట్‌కు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రవాసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇన్ని సార్లు తమ పిల్లలకు కరోనా టెస్ట్ చేయించడం కూడా తమకు ఇష్టం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమకు ఆరు నెలల పాప ఉందని, ఐదు సార్లు కూతురుకు టెస్ట్ చేయించడం ఇష్టం లేక భారత్ రావాలన్న ప్లాన్‌ను రద్దు చేసుకున్నామని ఓ జంట తెలిపింది. 

Updated Date - 2021-03-02T12:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising