ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారంలో 21 శాతం పెరిగిన కరోనా మరణాలు.. డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

ABN, First Publish Date - 2021-07-29T07:20:19+05:30

కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఈ క్రమంలో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఈ క్రమంలో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. గడిచిన వారం రోజుల్లో కరోనా మరణాల్లో 21శాతం పెరుగుదల కనిపించిందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు కూడా 8శాతం పెరుగుదలను చూశాయని వెల్లడించింది. వీటిలో అధికశాతం కేసులు భారత్, అమెరికా తదితర దేశాల్లో కనిపించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలియజేసింది. ‘‘ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య వచ్చే రెండు వారాల్లోనే 200 మిలియన్లు దాటొచ్చు’’ అని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, కరోనా డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. యూఎస్, భారత్, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ వేరియంట్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇదిలా వుండగా భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇటీవల పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2021-07-29T07:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising