ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటికి ఉపాధ్యక్షురాలి పేరును వాడటంపై వైట్‌హౌస్ వార్నింగ్ !

ABN, First Publish Date - 2021-02-19T00:45:02+05:30

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేరును ఎట్టిపరిస్థితిలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాల్లోనూ ఉపయోగించరాదని అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వార్నింగ్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేరును ఎట్టిపరిస్థితిలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాల్లోనూ ఉపయోగించరాదని అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె అధికార ప్రతినిధి సబారినా సింగ్​ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. కమలా మేనకోడలు మీనా హ్యారిస్ తన కంపెనీ బ్రాండ్​ ప్రచారం కోసం వైస్ ప్రెసిడెంట్ పేరును ఉపయోగించారని వార్తలొచ్చిన నేపథ్యంలో ఆమె ఈ మేరకు ప్రకటించారు. 'ఉపాధ్యక్షురాలు, ఆమె కుటుంబ సభ్యులు అధ్యక్ష భవనం పరంగా అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉంటారు. ఈ క్రమంలో సొంత బ్రాండ్​ను ప్రమోట్ చేసుకునేందుకు వారి పేర్లను, మద్దతును ఎలాంటి వాణిజ్య కార్యకలాపాల్లో వినియోగించకూడదు.' అని సబారినా అన్నారు. 


ఇదిలా ఉంటే.. అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలి​ పరపతిని ఆమె మేనకోడలు మీనా వాడుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్ లాయర్లు బిజినెస్ విషయమై ఆమెకు పలు సూచనలు చేసినట్టు సమాచారం. అయితే, ఎన్నికల ప్రచారం నాటి నుంచి అన్ని న్యాయ, చట్టబద్ధమైన నియమాలను తాను పాటిస్తున్నట్లు మీనా చెప్పినట్టు తెలుస్తోంది. అంతేగాక కమలాను పోలిన చిహ్నాలు, పేర్లను సైతం తమ వెబ్‌సైట్‌ నుంచి పూర్తిగా తొలగించినట్లు తెలిపింది. ఇకపై కూడా ఉపాధ్యక్షురాలి పేరును తమ వస్తువుల ప్రచారంలోకి వాడబోమని మీనా స్పష్టం చేశారు. 

Updated Date - 2021-02-19T00:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising