ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పదవికి నీరా టాండనే కరెక్ట్ పర్సన్: వైట్‌హౌస్

ABN, First Publish Date - 2021-02-24T22:04:40+05:30

భారత సంతతి మహిళ నీరా టాండన్‌ను మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: భారత సంతతి మహిళ నీరా టాండన్‌ను మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె నామినేషన్ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన వైట్‌హౌస్.. ఈ పదవికి ఆమెనే సరియైన వ్యక్తి అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసింది. 'బడ్జెట్ డిపార్ట్‌మెంట్‌ను నడిపించగల సమర్థవంతమైన ఒకేఒక అభ్యర్థి నీరా టాండన్' అని మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి పేర్కొన్నారు. 


పలువురు రిపబ్లికన్ సెనేటర్లు ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వస్తున్న వార్తాల నేపథ్యంలో అధ్యక్ష భవనం ఈ ప్రకటన చేసింది. అలాగే భారతీయ అమెరికన్ సమాజం కూడా నీరా అభ్యర్థిత్వాన్ని తమ పూర్తి మద్దతు తెలియజేసింది. ఇలా వైట్‌హౌస్, భారతీయ అమెరికన్ సమాజం ఆమెకు గట్టి మద్ధతునిస్తున్నాయి. ఈ పదవిని నిర్వహించేందుకు అన్ని అర్హతలు ఆమెకు వున్నాయని వారు చెబుతున్నారు. నీరాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ కాకస్ (సీఏపీఏసీ) సెనేటర్లకు లేఖ కూడా రాసింది. ఒకవేళ సెనేట్‌ నీరా అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తే.. 50 ఏళ్ల నీరా టాండన్ ఈ బాధ్యతలు చేపట్టబోయే తొలి అమెరికాయేతర వ్యక్తిగా రికార్డు కెక్కనున్నారు. కాగా, బహిరంగంగానే నేతలపై పక్షపాత వ్యాఖ్యలతో విరుచుకుపడే నీరా టాండన్ ధోరణి పట్ల కొంత వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2021-02-24T22:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising