ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాలా పెద్ద తప్పు చేశాం.. ప్రపంచాన్ని ఇంప్రెస్ చేయబోయి కష్టాలు కొని తెచ్చుకున్న పేద దేశం..!

ABN, First Publish Date - 2021-10-03T21:39:36+05:30

అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు వేదిక కావడం ఏ దేశానికైనా గర్వకారణమే. అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అయితే.. ఆర్థిక స్తోమతకు మించి హంగూఆర్భాటాలకు పోతే చివరకు మిగిలేది నష్టమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు వేదిక కావడం ఏ దేశానికైనా గర్వకారణమే. అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అయితే.. ఆర్థిక స్తోమతకు మించి హంగూఆర్భాటాలకు పోతే చివరకు మిగిలేది నష్టమే. పాపువా న్యూగినియా అనే ఓ చిన్న దేశం ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2018లో జరిగిన ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ కాన్ఫరెన్స్‌కు ఆతిథ్యమిచ్చిన పాపువా న్యూగినియా..నాడు ముందూ వెనుకా ఆలోచించకుండా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది. వివిధ దేశాధినేతల రవాణా కోసం విలాసవంతమైన మాసరాటీ కార్లను కొనుగోలు చేసింది. కేవలం కార్ల కోసమే 5.6 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 


అప్పట్లోనే ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. కార్ల విలువ నానాటికీ తరిగిపోతుంది..కాబట్టి.. ఇంత భారీ ఖర్చు అనవసరం అని అనేక మంది హెచ్చరించారు. అయితే.. ప్రభుత్వం మాత్రం తన పంథా వీడలేదు. ప్రముఖులు ప్రయాణించిన ఈ కార్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయంటూ తన నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. మూడేళ్ల తరువాత.. ఇప్పుడు తాను తప్పు చేశానని అంగీకరించింది. ఇప్పుడు ఆ కార్ల 20 శాతం తక్కువ ధరకైనా అమ్మి నష్టాన్ని కొంత మేర అయినా తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 


‘‘మాకు అప్పుడు ఏమాత్రం దూరదృష్టి ఉండిఉన్నా ఇటువంటి పని చేసి ఉండేవాళ్లం కాదు. అప్పుడు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మాత్రం ఇటువంటి డైలమాలో పడిపోయాం’’ అని పాపువా న్యూగినియా ఆర్థిక మంత్రి తాజాగా వ్యాఖ్యానించారు.  

Updated Date - 2021-10-03T21:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising