ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెచ్చగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా.. మీమ్స్‌పై స్పందించిన బెర్నీ శాండర్స్

ABN, First Publish Date - 2021-01-23T13:56:05+05:30

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే బైడెన్ ప్రమాణ స్వీకార ఫొటోల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే బైడెన్ ప్రమాణ స్వీకార ఫొటోల కంటే కూడా మరో ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అయిపోతూ వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా సెనెటర్ బెర్నీ శాండర్స్ జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. చలి నుంచి కాపాడుకునేందుకు చలి కోటు, చేతులకు గ్లౌజులు వేసుకుని కార్యక్రమంలో కూర్చున్నారు. ఈ దుస్తుల్లో ఆయన ముడుచుకుని కూర్చొని ఉన్న ఫొటో నెట్టింట్లో వైరల్ అయిపోయింది. ఆ ఫొటోతో మీమర్స్ విపరీతమైన మీమ్స్‌ను తయారుచేసేశారు. 


సెలబ్రిటీలు కూడా ఈ మీమ్స్‌పై స్పందించారంటే ఈ ఫొటో ఎంతలా వైరల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా తన ఫొటోపై బెర్నీ శాండర్స్ స్పందించారు. ‘నేను అక్కడ కూర్చుని వెచ్చగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. జరుగుతున్న కార్యక్రమంపై ధ్యాస పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాను’ అంటూ బెర్నీ శాండర్స్ చెప్పారు. మీమ్స్‌పై బెర్నీ శాండర్స్ ఆగ్రహం వ్యక్తం చేయకుండా స్పోర్టివ్‌గా తీసుకోవడం ఆయన మంచితనం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2021-01-23T13:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising