ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల్లో టీఆర్ఎస్‌కే పట్టంకట్టండి: ఎన్నారై టీఆర్ఎస్

ABN, First Publish Date - 2021-04-24T16:10:19+05:30

గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్‌లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నారై టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్‌లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏడేళ్లలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ చేరాయని ఇదిలాగే కొనసాగాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపర్చాలని కోరారు. వరదల సంభవించినప్పుడు, కరోనా సమయంలో వరంగల్ ప్రజలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్ ప్రజలకు చేసింది శూన్యం అన్నారు. సోషల్ మీడియా ద్వారా బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలను నమొద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర వివక్ష చూపుతోందని ఆరోపించిన ఆయన.. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కే పట్టం కట్టాలని అన్నారు. 



తెలంగాణలో అమలవుతున్నన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇతర ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదన్నారు. ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ రెండేళ్లలో అందిరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం ఇస్తుందన్నారు. 65ఏళ్లను 57 ఏళ్లకు కుదించి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులు కేటీఆర్, ఎంపీ సంతోష్ కరోనా బారినపడటం తమను బాధించిందన్నారు. మహమ్మారి నుంచి వారు త్వరగా కోలుకోవాలని  భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న ఎన్నారై తెరాస నాయకులు అనిల్ కూర్మాచలం, అశోక్ గౌడ్ దూసరి, సిక్కా చంద్రశేఖర్ గౌడ్, సతీష్ రెడ్డి, చిలుముల సత్యమూర్తి, పృథ్విరావుల స్థానిక కరోనా పరిస్థితులని బట్టి క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటారని నవీన్ రెడ్డి తెలిపారు. దేశంలో కరోనా ఉధృతి ఎక్కువ ఉన్నందున ప్రజలంతా తప్పకుండా మాస్క్ ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 


Updated Date - 2021-04-24T16:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising