ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమన్ వెళ్లే ముందు ఇది తెలుసుకోండి..

ABN, First Publish Date - 2021-01-22T14:56:49+05:30

ఒమన్ వచ్చే సందర్శకులకు సివిల్ ఏవియేషన్ అథారిటీ కీలక సూచన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సందర్శకులకు 7 రోజుల స్టే తప్పనిసరి

మస్కట్: ఒమన్ వచ్చే సందర్శకులకు సివిల్ ఏవియేషన్ అథారిటీ కీలక సూచన చేసింది. ఒమన్ వచ్చేవారు ఇకపై ఎనిమిది రోజులకు తగ్గకుండా స్టే(క్వారంటైన్ పీరియడ్ 7రోజులు) చేయాల్సి ఉంటుందని సీఏఏ తన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ మేరకు విమానయాన సంస్థలకు సమాచారం అందించింది. టికెట్ బుకింగ్ సమయంలో ఈ విషయాన్ని ప్రయాణికులకు తప్పకుండా చెప్పాలని సూచించింది. ఈ షరతుకు వారు ఒప్పుకుంటేనే టికెట్ బుక్ చేయాలని కోరింది. క్వారంటైన్ పీరియడ్ కంటే ముందు ప్రయాణికులు దేశం విడిచి వెళ్లేందుకు వీలు లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.   


ఏడు రోజుల తర్వాత ఎనిమిదో రోజున పీసీఆర్ టెస్టు ఫలితం ఆధారంగా ప్రయాణికుల జర్నీకి అనుమతి ఇస్తామని సీఏఏ తెలిపింది. కాగా, ఒమన్ ఇప్పటికే దేశంలో ప్రవేశించాలంటే పీసీఆర్ టెస్టు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇప్పుడు ఏడు రోజుల క్వారంటైన్ పీరియడ్‌ కూడా తోడు కానుంది. ఇదిలాఉంటే.. ఒమన్‌లో తీవ్ర ప్రభావం చూపుతున్న మహమ్మారి ఇప్పటి వరకు 1.32 లక్షల మందికి సోకగా.. 1,517 మందిని పొట్టనబెట్టుకుంది.

Updated Date - 2021-01-22T14:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising