ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఆ వీసాల జారీ ప్రారంభం..!

ABN, First Publish Date - 2021-11-07T13:36:55+05:30

కువైత్ వెళ్లే వారికి ఇది నిజంగా గుడ్‌న్యూస్. ఈ గల్ఫ్ దేశం తాజాగా ఎంట్రీ వీసాల జారీని ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్ వెళ్లే వారికి ఇది నిజంగా గుడ్‌న్యూస్. ఈ గల్ఫ్ దేశం తాజాగా ఎంట్రీ వీసాల జారీని ప్రారంభించింది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ శనివారం కీలక ప్రకటన చేసింది. ఎంట్రీ వీసాల జారీని ప్రారంభించినట్లు ప్రకటించిన మంత్రిత్వ శాఖ.. అక్కడి నిబంధనలను అనుసరించి విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులను, నివాసితులను వారి కుటుంబాలతో కలిసేందుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. వీసాల జారీ చేసే ప్రక్రియను తిరిగి ప్రారంభించిన కువైత్.. కేవలం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే వీసాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే వీసాల జారీలో మంత్రిత్వశాఖ కొన్ని షరతులు విధించింది. దీనిలో భాగంగా నాన్ రెసిడెంట్లకు టూరిస్ట్ వీసాలు ప్రస్తుతం జారీ చేయడం లేదని ప్రకటించింది. 


ఇక ఫ్యామిలీ వీసాల విషయానికి వస్తే.. భార్య, 16 ఏళ్లలోపు చిన్నారులకు మాత్రమే వీసాలు జారీ చేయనున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేగాక ఈ వీసా కోసం శాలరీ కండిషన్ కూడా పెట్టింది. వర్క్‌ పర్మిట్‌లో 500 కువైటీ దినార్లు(రూ.1.23లక్షలు) ఉన్నవారికి మాత్రమే ఫ్యామిలీ వీసా మంజూరు చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్(క్యూఆర్ కోడ్‌తో ఉన్నది) సమర్పించడం తప్పనిసరి. 


అది కూడా కువైత్‌లో ఆమోదం పొందిన ఫైజర్, ఆక్స్‌ఫర్డ్-అస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు తీసుకున్నవారికి మాత్రమే వీసాలు మంజూరు చేస్తామని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇకపోతే కమర్షియల్ విజిట్ వీసాలు, గవర్నమెంట్ విజిట్ మరియు ఈ-వీసాలు(ప్రస్తుతం 53 దేశాల వారికి) జారీ చేస్తున్నారు. అలాగే గృహకార్మికులకు సైతం యథావిధిగా వీసాల జారీ కొనసాగుతుందని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, ఎలక్ట్రానిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ఎంట్రీ వీసాలు, వర్క్ పర్మిట్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.  


Updated Date - 2021-11-07T13:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising