ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral video విమానం ల్యాండవుతుండగా పేలిన టైర్ ... ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..

ABN, First Publish Date - 2021-12-03T00:43:52+05:30

ల్యాండింగ్ సమయంలో పేలిన విమానం టైర్.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్:  టైరు పంక్చరై కార్లు,బస్సులు నడిరోడ్డుపై ఆగిపోతే ప్రయాణికులే స్వయంగా రంగంలోకి దిగి వాటిని రోడ్డుకు ఓ వైపునకు తోస్తారు. ఇది మనం నిత్యం చూసేదే! అయితే.. ఓ విమానం విషయంలోనూ అచ్చంగా ఇదే జరిగింది. నేపాల్‌లో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఇటీవల కోల్టీలోని బాజురా ఎయిర్‌పోర్టులో లాండవుతుండగా విమానం వెనక టైర్ పేలిపోయింది. అయితే..పైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ఫ్లైట్ సురక్షితంగానే ల్యాండైంది. కానీ.. ఆ తరువాతే అసలు సమస్య మొదలైంది. రన్‌వేకు ఓ వైపున నిలిచిపోయిన విమానాన్ని పైలట్ కదిలించలేకపోవడంతో ఇతర విమానాలకు ల్యాండింగ్‌లో ఇబ్బందులు ప్రారంభమైయ్యాయి.


అయితే.. అది చిన్న విమానం కావడంతో ప్రయాణికులే స్వయంగా రంగంలోకి దిగారు. ఎయిర్‌పోర్టు అధికారులు, ప్రయాణికులు తలో చేయి వేసి విమానాన్ని ఓ పక్కకు నెట్టి సమస్యను పరిష్కరించారు. అయితే.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ముఖ్యంగా నేపాలీలను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇటువంటి మా నేపాల్‌తో తప్ప ఎక్కడా జరగదు అంటూ కొందరు నేపాలీలు సరదా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 50 వేల వ్యూస్ వచ్చాయి. 



Updated Date - 2021-12-03T00:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising