ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ వాసికి అమెరికాలో అరుదైన గౌరవం

ABN, First Publish Date - 2021-10-10T01:23:24+05:30

డల్లాస్ మెట్రో ఏరియా లోని ఫ్రిస్కో సిటీకి సంబంధించిన పార్క్స్‌ రీక్రియేషన్‌ బోర్డు సభ్యుడిగా భారతీయుడైన వేణు భాగ్యనగర్‌ ఎన్నికయ్యారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన పార్క్స్‌ రిక్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్సాస్: డల్లాస్ మెట్రో ఏరియా లోని ఫ్రిస్కో సిటీకి సంబంధించిన పార్క్స్‌ రీక్రియేషన్‌ బోర్డు సభ్యుడిగా భారతీయుడైన వేణు భాగ్యనగర్‌ ఎన్నికయ్యారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన పార్క్స్‌ రిక్రియేషన్‌ బోర్డు.. నగర పరిధిలో ఉన్న పార్కుల సంరక్షణ, అభివృద్ధి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఫ్రిస్కో సిటీ కౌన్సిల్‌కి అనుబంధంగా ఈ బోర్డు పని చేస్తుంది. దాదాపు 2 లక్షల జనాభా గల ఫ్రిస్కో నగరంలో 49 పార్కు లు ఉన్నాయి.


కాగా.. వేణు భాగ్యనగర్‌ స్వగ్రామం కరీంనగర్‌ జిల్లా చేగుర్తి. కరీంనగర్‌లోనే డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు.


Updated Date - 2021-10-10T01:23:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising