ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

ABN, First Publish Date - 2021-01-21T19:02:18+05:30

గత 26 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ రాబోయే "ప్లవ" నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్, 13, 2021) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యూస్టన్: గత 26 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ రాబోయే "ప్లవ" నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్, 13, 2021) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ  నిర్వహిస్తున్నారు. భారత దేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో పాల్గొని విజయవంతం చెయ్యాల్సిందిగా వారు కోరుతున్నారు. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు  విభాగాలు ఉన్నాయి.


ప్రధాన విభాగం(26వ సారి నిర్వహణ):

భారత దేశంలో తప్ప ఇతర దేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నట్లు ఫౌండేషన్ వారు పేర్కొన్నారు. దీనిలో రెండు విభాగాలు ఉంటాయి. 1) ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: 116 డాలర్లు(రూ.8,467), 2) ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: 116 డాలర్లు(రూ.8,467).


మొట్టమొదటి రచన విభాగం(13వ సారి నిర్వహణ):

కథ, కవితలు రాయాలని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని కొత్త రచయితలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 13వ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వారు తెలిపారు. తరాల తారతమ్యం లేకుండా, భారత దేశం మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ "పోటీ"లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. దీనిలో రెండు విభాగాలు ఉంటాయి. 1) నా మొట్టమొదటి కథ: (ఉత్తమ కథ): 116 డాలర్లు(రూ.8,467), 2) నా మొట్టమొదటి కవిత: (ఉత్తమ కవిత): 116 డాలర్లు(రూ.8,467)


అన్ని పోటీలకు ఈ కింది షరతులు వర్తిస్తాయి

· ఒక రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక రచన మాత్రమే పంపించాలి. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్ (గౌతమి ఫాంట్స్)లో మాత్రమే పంపించాలి. చేతివ్రాతలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపు ఉండాలి. PDF, JPEGలలో పంపించినా ఆమోదమే.

· తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు.

· రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత చేయాలి. "మొట్టమొదటి కథ" మరియు "మొట్టమొదటి కవిత" పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలు అని హామీ పత్రంలో పేర్కొనాలి.

· బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్‌లోనూ, మధురవాణి.కామ్, తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.

· విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు (ఏప్రిల్ 13, 2021) కాని, అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ పోటీకి పంపిన రచనలను రచయితలు ఇంకెక్కడా ప్రచురించకూడదు.

· విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

· రచనలు ఫౌండేషన్‌కు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 20, 2020

· రచనలను (PDF, JPEG or Unicode fonts) ఫార్మాట్లలో మాత్రమే sairacha@gmail.com, vangurifoundation@gmail.comకు ఈ-మెయిల్ చేయాలి. 

Updated Date - 2021-01-21T19:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising