ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్ నుంచి వారికి మినహాయింపు ఇచ్చిన కువైట్ !

ABN, First Publish Date - 2021-03-24T16:41:22+05:30

కొన్నిరోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరగడంతో కువైట్ సర్కార్ బయటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోటల్ క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: కొన్నిరోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరగడంతో కువైట్ సర్కార్ బయటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోటల్ క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ క్వారంటైన్ విషయంలో కొన్ని సడలింపులు చేసింది. ఈ మేరకు సోమవారం కువైట్ కేబినెట్ కీలక ప్రకటన చేసింది. కొవిడ్-19 టీకా తీసుకున్న ప్రయాణికులతో పాటు కువైట్ విద్యార్థులకు ఈ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 23 నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి, కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ షేక్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా స్పష్టం చేశారు. ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ అల్ హమద్ అల్ సబా అధ్యక్షతన భేటీ అయిన కేబినేట్ అటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూను కూడా స్వల్పంగా సడలించింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది. మహమ్మారి ప్రభావం ఇంక పూర్తిగా తొలగిపోలేదు కనుక దేశ పౌరులు, నివాసితులు సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా కేబినెట్ కోరింది.   

Updated Date - 2021-03-24T16:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising