ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత పద్దతిలోనే H-1B Visa ల జారీ.. భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట

ABN, First Publish Date - 2021-12-23T13:11:58+05:30

హెచ్‌-1బీ వీసాల జారీ విషయంలో గతంలో మాదిరిగా లాటరీ విధానాన్నే అనుసరించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు నార్త్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలను అమలుచేయనున్నట్టు అమెరికా అంతర్గత భద్రతా విభాగం పేర్కొంది. వేల సంఖ్యలో భారతీయ ఐటీ నిపుణులకు తాజా పరిణామం ఊరట కల్పించనుంది. టెక్నాలజీ కంపెనీలు హెచ్‌-1బీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాటరీ ద్వారానే హెచ్‌-1బీ వీసాలు

వేతనం ఆధారిత విధానాన్ని కొట్టేసిన అమెరికా కోర్టు

వాషింగ్టన్‌, డిసెంబరు 22: హెచ్‌-1బీ వీసాల జారీ విషయంలో గతంలో మాదిరిగా లాటరీ విధానాన్నే అనుసరించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు నార్త్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలను అమలుచేయనున్నట్టు అమెరికా అంతర్గత భద్రతా విభాగం పేర్కొంది.  వేల సంఖ్యలో భారతీయ ఐటీ నిపుణులకు తాజా పరిణామం ఊరట కల్పించనుంది. టెక్నాలజీ కంపెనీలు హెచ్‌-1బీ వీసాల ఆధారంగానే ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తుంటాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో లాటరీ విధానాన్ని రద్దు చేసి, వేతనం ఆధారంగా హెచ్‌-1వీ వీసాలను జారీచేయాలని ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ మార్గదర్శకాలు జారీచేసింది. అయితే జో బైడెన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత... ట్రంప్‌ ప్రభుత్వ ప్రతిపాదనను 2021 డిసెంబరు 31 వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ట్రంప్‌ ప్రభుత్వ ప్రతిపాదనపై అమెరికాకు చెందిన చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్‌ కోర్టు... వేతనం ఆధారంగా వర్క్‌ వీసాల జారీ విధానాన్ని కొట్టేసింది. దీంతో లాటరీ విధానమే కొనసాగనుంది.

Updated Date - 2021-12-23T13:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising