ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కొవిడ్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం: అమెరికా

ABN, First Publish Date - 2021-04-22T01:21:30+05:30

భారత్‌లో కరోనా వ్యాప్తి చెందుతున్న తీరును నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా తాజాగా ప్రకటించింది. అమెరికా విదేశాంగ శాఖ సెక్రెటరీ, భారత్ విదేశాంగ శాఖ మంత్రి మధ్య జరిగిన చర్చల అనంతరం అమెరికా ఈ ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారత్‌లో కరోనా వ్యాప్తి చెందుతున్న తీరును నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా తాజాగా ప్రకటించింది. అమెరికా విదేశాంగ శాఖ సెక్రెటరీ, భారత్ విదేశాంగ శాఖ మంత్రి మధ్య జరిగిన చర్చల అనంతరం అమెరికా ఈ ప్రకటన చేసింది. ‘‘అంతర్జాతీయ ప్రయాణికులకు చేయాల్సిన పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే.. భారత్‌లో పరిస్థితిని మేము నిశితంగా గమనిస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు అమెరికా సెక్రెటరీ బ్లింకెన్, భారత విదేశాంగ శాఖ మంత్రి జయ్ శంకర్ ఈ విషయాలను చర్చించారు’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలో ఎక్కడ కరోనా అదుపు తప్పినా అది అమెరికా ప్రజలకు ప్రమాదమే. ఈ విషయాన్ని అమెరికా స్టెట్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు’’ అని ఆయన తెలిపారు. 


కాగా.. అమెరికా పౌరులు ఇండియా ప్రయాణాన్ని కొంత కాలం పాటు వాయిదా వేసుకోవాలని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ సీడీసీ ఇటీవలే సూచించింది. ‘‘భారత్‌లో ప్రస్తుత పరిస్థితులను బట్టి.. టీకా తీసుకున్న వారు కూడా కరోనా బారినపడి వైరస్‌ను ఇతరులకు వ్యాప్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి..భారత్‌కు వెళ్లే ఆలోచనను కొంత కాలం పాటు వాయిదా వేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌‌కు వెళ్లాల్సి వస్తే.. ముందుగా టీకా వేయించుకోవాలి. అక్కడ జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి’’ అని సీడీసీ సూచించింది. 

Updated Date - 2021-04-22T01:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising