ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా భారీ సాయం !

ABN, First Publish Date - 2021-04-29T15:25:11+05:30

మహమ్మారి కరోనావైరస్ ఉధృతితో వణికిపోతున్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా భారీ సాయం చేసింది. అత్యవసర సాయం కింద సుమారు 100 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో రూ.744కోట్లు) విలువైన వైద్య పరికరాలు, మెడిసిన్స్ పంపిస్తున్నట్లు జో బైడెన్ సర్కార్ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: మహమ్మారి కరోనావైరస్ ఉధృతితో వణికిపోతున్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా భారీ సాయం చేసింది. అత్యవసర సాయం కింద సుమారు 100 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో రూ.744కోట్లు) విలువైన వైద్య పరికరాలు, మెడిసిన్స్ పంపిస్తున్నట్లు జో బైడెన్ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు అధికార భవనం వైట్‌హౌస్ బుధవారం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అత్యవసరంగా 17 వందల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 11 వందల ఆక్సిజన్ సిలిండర్లు, 20 మంది రోగులకు నిరంతరాయంగా ప్రాణవాయువు సరఫరా చేసే ఆక్సిజన్ యూనిట్లను పంపిస్తున్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది.


అంతేగాక కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కోటి మంది భారతీయులకు 23 మిలియన్ల డాలర్ల మొత్తం ఇచ్చామని, వెయ్యి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 1.5లక్షల ఎన్95 మాస్క్‌లు, 9.6 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ పంపించినట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. వీటితో పాటు తమ కోసం ఆర్డర్ చేసిన రెండు కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా టీకాలు, యాంటీ వైరల్ డ్రగ్ రెమ్​డెసివిర్ వయల్స్ 20 వేల వరకూ పంపిస్తున్నట్లు బైడెన్ సర్కార్ స్పష్టం చేసింది. వీటిని తీసుకొని ఇప్పటికే కాలిఫోర్నియా నుంచి తొలి విమానం భారత్​కు బయల్దేరినట్లు పేర్కొంది. గురువారం 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో భారత్‌కు రానున్నాయి. 



Updated Date - 2021-04-29T15:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising