ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు అమెరికా తీపి కబురు

ABN, First Publish Date - 2021-06-11T22:50:55+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువుల కోసం సిద్ధం అవుతున్న విద్యార్థులకు న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీ కార్యాలయం తీపి కబురు చెప్పింది. జూన్ 14 (సోమవారం) నుంచి స్టూడెంట్ వీసాల జారీకి సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువుల కోసం సిద్ధం అవుతున్న విద్యార్థులకు న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీ కార్యాలయం తీపి కబురు చెప్పింది. జూన్ 14 (సోమవారం) నుంచి స్టూడెంట్ వీసాల జారీకి సంబంధించిన ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. జూలై-ఆగస్టులో ప్రారంభమయ్యే తరగతులకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు https://ustraveldocs.com/in వెబ్‌సైట్‌ను సందర్శించి,  అపాయింట్మెంట్‌ను బుక్ చేసుకోవాలని వెల్లడించింది. విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఈ సందర్భంగా ఎంబసీ తెలిపింది. 


కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు విధించింది. అత్యవసర ప్రయాణాలకు సైతం పరిమిత సంఖ్యలో అనుమతిచ్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీసాలకు సంబంధించిన ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో వెబ్‌సైట్‌కు భారీగా రద్దీ పెరగొచ్చని యూఎస్ ఎంబసీ అభిప్రాయపడింది. సాంకేతిక సమస్యలు తలెత్తొచ్చని పేర్కొంది. అయితే అభ్యర్ధులు మాత్రం ఓపికతో ఉండాలని తెలిపింది. సాంకేతిక సమస్యలు పునరావృతం అయితే supportindia@ustraveldocs.com లేదా +91 120 4844644, +912262011000 ద్వారా ఇబ్బందులను తమ దృష్టికి తేవాలని సూచించింది. 


Updated Date - 2021-06-11T22:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising