ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూళ్లలో యోగాకు అలబామా ప్రతినిధుల సభ గ్రీన్ సిగ్నల్!

ABN, First Publish Date - 2021-03-12T23:52:33+05:30

అగ్రరాజ్యం అమెరికాలోని అలబామా కీలక పరిణామం చోటు చేసుకుంది. అలబామాలోని పబ్లిక్ స్యూళ్లలో కొన్ని ఏళ్లుగా యోగాపై నిషేధం కొనసాగుతోంది. దశాబ్దాలనాటి ఈ నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ డెమొక్రటిక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని అలబామా కీలక పరిణామం చోటు చేసుకుంది. అలబామాలోని పబ్లిక్ స్కూళ్లలో కొన్ని ఏళ్లుగా యోగాపై నిషేధం కొనసాగుతోంది. దశాబ్దాలనాటి ఈ నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు జెరెమీ గ్రే ప్రవేశపెట్టిన బిల్లకు.. ఆ రాష్ట్ర ప్రతినిధుల సభ గురువారం రోజు ఆమోదం తెలిపింది. 73 మంది సభ్యులు ఈ బిల్లకు అనుకూలంగా ఓటు వేయగా.. 25 మంది వ్యతిరేకించారు.  ఈ బిల్లు ప్రకారం స్కూళ్లలో నమస్తే చెప్పడం, మంత్రాలు జపించడం నిషేధం. కాగా.. ఈ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందితే.. స్కూళ్లలో యోగాపై ఉన్న నిషేధం తొలగిపోతుంది.  ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ లభించడం పట్ల జెరెమీ గ్రే సంతోషం వ్యక్తం చేశారు. యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వాటిని తాను పొందినట్టు చెప్పారు. 


ఈ క్రమంలోనే యోగాపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ బిల్లు ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. కాగా.. 1993లో అలబామా బోర్డ్ ఆఫ్ ఎడ్యూకేషన్ కన్సర్వేటివ్ గ్రూప్‌తో కలిసి స్కూళ్లలో యోగా, మెడిటేషన్, హిప్నోసిస్ చేయడాన్ని నిషేధించింది. ఇదిలా ఉంటే.. జెరెమీ గ్రే.. గతంలో కూడా ఇందుకు సంబంధించిన బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా దిగువసభ దానికి ఆమోదం తెలిపింది. అయితే సెనేట్‌లో ఆ బిల్లకు ఆమోదం లభించకపోవడంతో యోగాపై నిషేధం కొనసాగింది. 


Updated Date - 2021-03-12T23:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising