ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరస్‌ లాంటి టీకాను అభివృద్ధి చేసిన యూఎస్ శాస్త్రజ్ఞులు

ABN, First Publish Date - 2021-08-14T13:13:21+05:30

అచ్చం కరోనా వైరస్‌ ఆకారంలో ఉండే నానోపార్టికల్‌ ప్రొటీన్‌ ఆధారిత టీకాను అమెరికా శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఆగస్టు 13: అచ్చం కరోనా వైరస్‌ ఆకారంలో ఉండే నానోపార్టికల్‌ ప్రొటీన్‌ ఆధారిత టీకాను అమెరికా శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. ఈ కొత్త టీకాను ఎలుకలపై ప్రయోగించగా సమగ్రమైన యాంటీబాడీ స్పందన, టీ సెల్స్‌ స్పందన ఉన్నట్టు తేలింది. టీకాలను శరీరంలోకి ప్రవేశపెట్టేందుకు గతంలో తాము తయారుచేసిన పాలిమర్‌ సోమ్స్‌ అనే ఉపకరణాల వల్ల కేవలం టీ సెల్స్‌ స్పందన మాత్రమే వస్తున్నట్టు గుర్తించిన యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో శాస్త్రవేత్తలు యాంటీబాడీ స్పందనను కూడా పెంచే మార్గాలపై దృష్టి సారించారు. నానోపార్టికల్స్‌ను అచ్చం కరోనా వైర్‌సలాగా తయారుచేసి (అంటే.. ఆర్బీడీలను నానోపార్టికల్స్‌పై స్పైక్‌ ప్రొటీన్ల రూపంలో అమర్చి) ఎలుకల్లోకి ప్రవేశపెట్టారు. మూడు వారాల వ్యవధిలో ఇలా రెండు డోసులు ఇచ్చారు. దీంతో వాటిలో కరోనా వైర్‌సకు యాంటీబాడీలు ఉత్పత్తి అవడమే కాక, టీ సెల్స్‌ స్పందన కూడా పెరిగినట్టు వెల్లడించారు.

Updated Date - 2021-08-14T13:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising