ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన హెచ్-1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ

ABN, First Publish Date - 2021-02-19T01:44:41+05:30

అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్-1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ముగిసినట్టు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్-1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ముగిసినట్టు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్ణీత పరిమితికి సరిపడా దరఖాస్తులు స్వీకరించినట్టు వెల్లడించింది. యేటా యూఎస్ వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. ఇలా ప్రతి ఏడాది అగ్రరాజ్యం విదేశీయులకు ఉపాధి కల్పించేందుకు మొత్తం 85వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. 


దీంతో 2021 ఆర్థిక సంవత్సరానికి గాను పరిమితికి సరిపడా దరఖాస్తులు స్వీకరించామని యూఎస్‌సీఐఎస్ ప్రకటించింది. దరఖాస్తుదారులలో అర్హులైన వారిని కంప్యూటర్‌ లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలిపారు. కాగా, తిరస్కరించబడిన దరఖాస్తుల సమాచారాన్ని సంబంధిత అభ్యర్ధులకు వారి ఆన్‌లైన్ ఖాతాల ద్వారా ఇప్పటికే తెలియజేసినట్లు యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. ఇదిలాఉంటే.. ప్రతి ఏడాది అగ్రరాజ్యం ఇచ్చే 85వేల కొత్త హెచ్-1బీ వీసాలలో సుమారు 70 శాతం వీసాలు(దాదాపు 60వేలు) భారతీయులకు జారీ అవుతున్నట్లు సమాచారం. భారత్ తర్వాత అత్యధికంగా హెచ్-1బీ వీసాలు పొందేది డ్రాగన్ కంట్రీ చైనానే. 

Updated Date - 2021-02-19T01:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising