ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాణ స్వీకారోత్సవం.. భారత్‌లో లైవ్ ఎప్పట్నుంచంటే..

ABN, First Publish Date - 2021-01-20T17:48:06+05:30

అగ్రరాజ్యం తదుపరి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం తదుపరి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికోసం కేపిటల్ భవనం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఈసారి కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించేందుకు అమెరికా మొగ్గుచూపింది. దీంతో ప్రతిసారి లక్షలాది మంది వచ్చే ఈ వేడుక ఈసారి చాలా తక్కువ మంది సమక్షంలో జరగనుంది. అధికారిక సమాచారం ప్రకారం ఓ వెయ్యి మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలుస్తోంది. బుధవారం రాత్రి 8.30 గంటల(భారత కాలమానం ప్రకారం) నుంచి ప్రెసిడెన్సియల్ ఇనాగురల్ కమిటీ(పీఐసీ) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అదే సమయం నుంచి ఈ వేడుక సామాజిక మాధ్యమాల్లో, టీవీ చానెల్స్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. అయితే, రాత్రి 10 గంటల ప్రాంతంలో అమెరికా జాతీయ గీతంతో అసలు ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం అవుతుంది. 


ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో చూడాలంటే..

ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం bideninaugural.org. వెబ్‌సైట్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. దీని ద్వారానే యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో కూడా చూడొచ్చు. అలాగే అన్ని న్యూస్ చానెల్స్‌లో ఇదే సమయంలో ప్రత్యక్షప్రసారం కానుంది. గంటన్నర పాటు ఈ లైవ్ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని 'సెలబ్రేటింగ్ అమెరికా' పేరిట టామ్ హాంక్స్ హోస్ట్ చేయనున్నారు. 


బైడెన్, కమలను ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే..

ఎప్పటిలాగే కేపిటల్‌ హిల్‌ భవన మెట్లపై ఏర్పాటు చేసిన వేదికపై అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆనవాయితీ ప్రకారం మొదట వైస్ ప్రెసిడెంట్ కమల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆమె చేత సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం అధ్యక్షుడు బైడెన్ ప్రమాణం చేస్తారు. బైడెన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ చేత 127 ఏళ్ల ఫ్యామిలీ బైబిల్‌పై ప్రమాణం చేయిస్తారు.


ఇక 1937 నుంచి జనవరి 20వ తేదీనే అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. మొదటిసారి ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్ జవనవరి 20న ప్రమాణస్వీకారం చేశారు. అప్పటినుంచి ఇదే రోజునా కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవం జరుగుతూ వస్తోంది. అంతకుముందు ఈ కార్యక్రమం మార్చి 4న జరిగేది. కాగా, ఈసారి ఈ కార్యక్రమం కోసం ఇంతకుముందెన్నడూ లేని విధంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ మొత్తాన్ని దిగ్బంధించారు. ప్రమాణ స్వీకారం నాడు అంతర్గత అల్లర్లు జరిగే అవకాశం ఉందని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) సమాచారం మేరకు రాజధానిలో 25వేల మంది నేషనల్‌ గార్డ్స్‌తో భద్రతా ఏర్పాటు చేశారు.  

Updated Date - 2021-01-20T17:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising