ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ నుంచి విదేశాలకు వ్యాక్సిన్.. ప్రశంసలు కురిపించిన అమెరికా

ABN, First Publish Date - 2021-01-23T18:30:26+05:30

భారత ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు వ్యాక్సిన్ డోస్‌లను ఉచితంగా పంపిస్తున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారత ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు వ్యాక్సిన్ డోస్‌లను ఉచితంగా పంపిస్తున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం చర్యల పట్ల తాజాగా అమెరికా ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ప్రపంచ దేశాలకు సహాయం చేసేందుకు భారత్ తమ ఫార్మా రంగాన్ని ఉపయోగించుకోవడంపై యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అభినందించింది. లక్షల కొద్దీ వ్యాక్సిన్ డోస్‌లను విదేశాలకు బహుమతిగా ఇవ్వడాన్ని ప్రశంసించింది. కాగా.. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవులు, మయన్మార్, మారిషస్, సేషెల్స్ దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ డోస్‌లను అందజేసింది. బ్రెజిల్, మొరాకో దేశాలకు కమర్షియల్ షిప్‌మెంట్‌ను కూడా ప్రారంభించింది. భారత్ నుంచి వ్యాక్సిన్ షిప్‌మెంట్ తాజాగా బ్రెజిల్‌కు చేరుకుంది. వ్యాక్సిన్ షిప్‌మెంట్ అందిన తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఆంజనేయుడు ఫొటోతో భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్లను సంజీవనిగా ఆయన అభివర్ణించారు.

Updated Date - 2021-01-23T18:30:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising