ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delta Variant: డెల్టా భయంతో అమెరికన్ ప్రజలు చేస్తున్న పని ఇదీ..!

ABN, First Publish Date - 2021-07-28T11:30:02+05:30

అగ్రరాజ్యం అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. యూఎస్‌లో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 80

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. యూఎస్‌లో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 80 శాతంపైగా డెల్టా వేరియంట్ కేసులే. ఈ నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లు ఇప్పుడు వినూత్న నిర్ణయం తీసుకుంటున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కరోనాను నియంత్రించేందుకు తయారు చేసిన వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్. అంటే ఇది ఒక్క వ్యాక్సిన్ తీసుకుంటే చాలు. అయితే డెల్టా వేరియంట్‌పై దీని ప్రభావం 70శాతమేనట. అదే సమయంలో ఫైజర్, మోడెర్నా రెండు డోసులు తీసుకుంటే 90శాతం డెల్టాకు వ్యతిరేకంగా పనిచేస్తాయని తేలింది. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకున్న వాళ్లు ఇప్పుడు బూస్టర్ డోస్‌గా ఫైజర్ లేదంటే మోడెర్నా టీకా తీసుకుంటున్నారు. ఇలా వేరే వేరే కంపెనీల వ్యాక్సిన్లు తీసుకోవడంపై ప్రపంచంలో పలుదేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. అమెరికాలో ఇంకా దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలు తీసుకుంటున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-07-28T11:30:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising