ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా నేవీ దుస్సాహసం !

ABN, First Publish Date - 2021-04-10T12:56:12+05:30

భారత జలాల్లో అమెరికా దుస్సాహసం చేసింది. అనధికారికంగా లక్షద్వీప్‌ సమీపంలోని భారత ప్రత్యేక ఆర్థిక మండలి(ఈఎజడ్‌)లోకి ప్రవేశించిన అమెరికా క్షిపణి నిరోధక నౌక.. పలు విన్యాసాలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్షద్వీప్‌ వద్ద యుద్ధ నౌకతో విన్యాసాలు

భారత్‌కు సమాచారం ఇవ్వకుండానే ఆపరేషన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: భారత జలాల్లో అమెరికా దుస్సాహసం చేసింది. అనధికారికంగా లక్షద్వీప్‌ సమీపంలోని భారత ప్రత్యేక ఆర్థిక మండలి(ఈఎజడ్‌)లోకి ప్రవేశించిన అమెరికా క్షిపణి నిరోధక నౌక.. పలు విన్యాసాలు చేసింది. లక్షద్వీ్‌పకు పశ్చిమంలో 130 నాటికల్‌ మైళ్ల దూరంలో అమెరికా క్షిపణి నిరోధక యుద్ధనౌక ‘యూఎ్‌సఎస్‌ జాన్‌పాల్‌ జోన్స్‌’ ఈ విన్యాసాల్లో పాల్గొంది. దీనిపై భారత ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఈ నెల 7న ’ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ ఆపరేషన్‌’ పేరుతో విన్యాసాలు నిర్వహించామని.. అమెరికా నౌకాదళానికి ఇవన్నీ మామూలేనని, గతంలో కూడా ఇలా విన్యాసాలు చేశామని, భవిష్యత్‌లో కూడా చేస్తామని అమెరికా నావికాదళానికి చెందిన ఏడో ఫ్లీట్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని కోరింది. ఈ ప్రకటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా విదేశాంగ శాఖతో దౌత్యపరమైన మార్గాల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. 

Updated Date - 2021-04-10T12:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising