ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు అడుగుల హైట్ కావాలని.. ఈ అమెరికన్ ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2021-01-20T23:39:26+05:30

చిన్నప్పటి నుంచి తీరని కోరిక ఏమైనా ఉందా అంటే.. హైట్ పెరగాలనుకున్నా తాము పెరగలేకపోయామని చాలా మంది చెబుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్సాస్: చిన్నప్పటి నుంచి తీరని కోరిక ఏమైనా ఉందా అంటే.. హైట్ పెరగాలనుకున్నా తాము పెరగలేకపోయామని చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా మగవారు పెదయ్యాక తాము ఆరు అడుగుల హైట్ పెరుగుతామంటూ చెబుతూ ఉంటారు. అయితే ఆరు అడుగులు అయ్యే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. కోరిక తీరని వారు ఇక తాము చేసేదేమీ లేదని ఉన్న హైట్‌తోనే సంతృప్తి చెందుతుంటారు. కానీ అమెరికాకు చెందిన ఆల్ఫాన్సో ఫ్లోర్స్(28) అనే వ్యక్తి మాత్రం తన హైట్‌ను ఎలాగైనా పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. 


ఆల్ఫాన్సోకు చిన్నతనం నుంచి కూడా ఆరు అడుగుల ఎత్తు పెరగాలనేది కోరిక. తాను ఎంతగానో అభిమానించే మైఖేల్ జార్డన్, కోబ్ బ్రైంట్, ఫిల్ జాక్సన్‌లు ఆరు అడుగులు ఉండటంతో తాను కూడా ఆరు అడుగులు అవ్వాలని చిన్నతనం నుంచి కలలు కంటూ వచ్చాడు. సరిగ్గా 5 అడుగుల 11 అంగుళాల వరకు పెరగగలిగాడు కాని ఆరు అడుగులకు చేరలేకపోయాడు. దీంతో ప్రత్యామ్నాయాల కోసం వెతకసాగాడు. ఇదే సమయంలో అతడికి డాక్టర్ కెవిన్ అనే వైద్యుడు దొరికాడు.


డాక్టర్ కెవిన్ ద్వారా ఆల్ఫాన్సో తన కలను సాకారం చేసుకున్నాడు. అవయవ పొడిగింపు(లింబ్ లెంథెనింగ్) సర్జరీ ద్వారా ఆల్ఫాన్సో తన హైట్‌ను రెండు అంచులు పెరిగేలా చేసుకోగలిగాడు. ఈ సర్జరీలో భాగంగా ఆల్ఫాన్సో కాలులోని ఎముకలను కోసి వాటి మధ్య గ్యాప్ పెరిగేలా డివైజ్‌ను పెట్టారు. సర్జరీ అయిన తరువాత ఏడు నెలల పాటు ఆల్ఫాన్సో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆల్ఫాన్సో హైట్ రెండు అంగుళాలు పెరగడంతో.. తన హైట్ 5.11 నుంచి 6.1కు చేరింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు సర్జరీ చేయించుకోవద్దని సలహా ఇచ్చినప్పటికి.. ఆరు అడుగుల ఎత్తు పెరగడం తనకు ఇష్టం కావడంతో సర్జరీ చేయించుకున్నట్టు ఆల్ఫాన్సో చెప్పాడు. తనకు జరిగింది చాలా సురక్షితమైన సర్జరీ అని, వైద్యులు తనను దగ్గరుండి చూసుకున్నారని ఆల్ఫాన్సో తెలిపాడు.

Updated Date - 2021-01-20T23:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising