ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాముల భయంతో అతడు చేసిన పనికి రూ.7.5 కోట్ల నష్టం.. America లో హాట్ టాపిక్..!

ABN, First Publish Date - 2021-12-08T20:46:40+05:30

ఇంటి చుట్టుపక్కల అడవి ఉంటే.. ఆ ఇంట్లో ఉండే వారికి పాముల బెడద ఎక్కువ ఉంటుంది. ఇంట్లోకి తరచూ పాములు వస్తూ.. ఇంట్లో ఉన్నవారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో పాము

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఇంటి చుట్టుపక్కల అడవి ఉంటే.. ఆ ఇంట్లో ఉండే వారికి పాముల బెడద ఎక్కువ ఉంటుంది. ఇంట్లోకి తరచూ పాములు వస్తూ.. ఇంట్లో ఉన్నవారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో పాములు పట్టుకునే వాళ్లను పిలిపించి.. ఇంట్లోకి వచ్చిన పాములను దూరంగా పడేయమని చెబుతారు. లేకపోతే.. వాళ్లే ధైర్యం చేసి.. పాములను పట్టుకుని దూరంగా వదిలేస్తారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం తన ఇంట్లో దూరిన పామును పట్టుకోబోయి.. భారీ నష్టాన్ని మూటకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే..



అమెరికాలోని మేరీలాండ్‌లో ఓ వ్యక్తికి సుమారు 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉంది. అయితే  చుట్టుపక్కల అడవి ఉందో లేక మరేదైనా కారణమో కానీ.. ఆ ఇంట్లోకి తరచూ పాములు వస్తూ ఉండేవి. ఈ క్రమంలోనే  తాజాగా అతడి ఇంట్లో పాము దూరింది. అది గమనించిన ఇంటి యజమాని.. బొగ్గులను మండించి పొగ పెట్టడం ద్వారా పామును బయటికి రప్పించొచ్చని భావించాడు. ఇందులో భాగంగానే ఇంట్లో అక్కడక్కడా భారీగా బొగ్గును పేర్చి, నిప్పు పెట్టాడు. దీంతో ప్రమాదవశాత్తు నిప్పు.. ఇంట్లోని కర్టెన్లకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం అంది.. అక్కడకు చేరి మంటలను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగనప్పటికీ.. సదరు ఇంటి యజమాని భారీ నష్టాన్ని మూటకట్టుకున్నాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ.7.5కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడ్డారు. 




Updated Date - 2021-12-08T20:46:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising