ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రెండు నిబంధనలకు ముగింపు పలకాలనుకుంటున్న Florida.. ప్రయత్నాలు మొదలు పెట్టిన US Lawmakers

ABN, First Publish Date - 2021-11-17T04:43:51+05:30

ఎక్కడి కెళ్లినా మాస్కులు పెట్టుకోవాలి.. ఇదో తలనొప్పిగా మారింది.. ఇదీ అమెరికాలో అనేక మంది వేస్తున్న ప్రశ్నలు. రిపబ్లికన్ పార్టీ వారు ముందు నుంచీ ఈ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుండడాన్ని చూసిన వారు.. ఫెడరల్ ప్రభుత్వం రూపొందించిన కరోనా నిబంధనలకు ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎక్కడికెళ్లినా మాస్కులు పెట్టుకోవాలి.. ఇదో తలనొప్పిగా మారింది.. మా మాస్కులు మా ఇష్టం..  టీకా వేసుకున్న వారిని కూడా మాస్కు పెట్టుకోమంటారేం..? మరి మతపరమైన, ఇతర కారణాల రీత్యా మాస్కులు ధరించకూడని వారి పరిస్థితేంటి..? అసలు మాకు ఈ నిర్బంధం ఏంటీ..? ఇదీ అమెరికాలో అనేక మంది వేస్తున్న ప్రశ్నలు. రిపబ్లికన్ పార్టీ వారు ముందు నుంచీ ఈ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుండడాన్ని చూసిన వారు.. ఫెడరల్ ప్రభుత్వం రూపొందించిన కరోనా నిబంధనలకు ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తున్నారు. 


ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఫ్లోరిడా ప్రజాప్రతినిధులు కరోనా నిబంధనలు సడలించే విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ పరిణామం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమవుతోంది. మాస్కుల నిబంధన తొలగించడంతో పాటు ఈ రూల్‌ను తప్పనిసరి చేస్తున్న స్కూళ్లపై తల్లిదండ్రులు కేసు వేసే అవకాశాన్ని కల్పించే అంశాన్ని కూడా వారు చర్చిస్తున్నారు. వారం పాటు ఈ చర్చలు జరుగుతాయని సమాచారం. అయితే.. డామోక్రటిక్‌లు మాత్రం ఈ ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ పరిణామాల ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే.

Updated Date - 2021-11-17T04:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising