ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కొక్కరికీ రూ.లక్ష ఇచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-02-27T23:45:17+05:30

అమెరికా ప్రతినిధుల సభ శనివారం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు సెనేట్‌లో కూడా గట్టెక్కితే అమెరికన్ల అకౌంట్లలోకి 1,400 డాలర్లు వచ్చి పడనున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభ శనివారం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు సెనేట్‌లో కూడా గట్టెక్కితే అమెరికన్ల అకౌంట్లలోకి 1,400 డాలర్లు వచ్చి పడనున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి పంజా విసరడంతో అమెరికాలో కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి బైడెన్ భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. దీనికి సంబంధించిన బిల్లకు అమెరికా ప్రతినిధుల సభ శనివారం రోజు పచ్చ జెండా ఊపింది. 219-212 ఓట్ల తేడాతో దిగువ సభ(ప్రతినిధుల సభ)లో ఈ బిల్లు గట్టెక్కింది. మొదటి నుంచి ఈ ప్యాకేజీని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు.. సభలో ఈ బిల్లుకు మద్దతు తెలపలేదు. వీరితోపాటు డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు.


ఇదిలా ఉంటే.. వచ్చే వారం ఈ బిల్లుపై సెనేట్‌లో చర్చ జరగనుంది. సెనేట్ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే చిన్నతరహా పరిశ్రమలతోపాటు రాష్ట్రాలకు ఆర్థిక  లబ్ధి చేకూరనుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరిగేందుకు మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా వార్షిక ఆదాయం 75వేల డాలర్ల కంటే తక్కవగా ఉన్న ఒక్కో అమెరికా పౌరునికి నేరుగా 1,400 డాలర్ల(ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. లక్ష)ను అమెరికా ప్రభుత్వం చెల్లిస్తుంది. 


Updated Date - 2021-02-27T23:45:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising