ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి రూ.63 లక్షల భారీ జరిమానా.. H1B Visa విషయంలో చేసిన మిస్టేక్‌తో..

ABN, First Publish Date - 2021-11-16T23:44:04+05:30

అమెరికాలోని కార్మిక శాఖ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఊహించని షాకిచ్చింది. ఏకంగా రూ. 63 లక్షలను జరిమానా కింద వసూలు చేసింది. హెచ్1బీ వీసా నిబంధనలు అతిక్రమించిన కారణంగా అక్కడి అధికారులు వాయిస్ఎక్స్‌నెట్ అనే కంపెనీపై ఈ స్థాయి జరిమానా విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని కార్మిక శాఖ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఊహించని షాకిచ్చింది. ఏకంగా రూ. 63 లక్షలను జరిమానా కింద వసూలు చేసింది. హెచ్1బీ వీసా నిబంధనలు అతిక్రమించిన కారణంగా అక్కడి అధికారులు వాయిస్ఎక్స్‌నెట్ అనే కంపెనీపై ఈ స్థాయి జరిమానా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు వచ్చిన హెచ్1బీ వీసాపై వచ్చిన విదేశీ ఉద్యోగులకు కొన్ని హక్కులు ఉంటాయి. అమెరికా చట్టాల ప్రకారం.. ఇలా వచ్చిన ఉద్యోగులను కంపెనీలు బెంచ్‌కు పరిమితం చేయడం చట్ట రీత్యా నేరం. బెంచింగ్ లేదా బెంచ్‌కు పరిమితం చేయడం అంటే.. ఉద్యోగులకు ఎటువంటి పని ఇవ్వకుండా.. జీతం కూడా చెల్లించకుండా అలా పక్కన పెట్టేయడం. 


ఇక వాయిస్‌ఎక్స్‌నెట్ అనే సాఫ్ట్‌‌వేర్ సంస్థకు హైదరాబాద్‌తో పాటు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోనూ ఓ శాఖ ఉంది. అయితే.. ఇటీవల ఓ భారతీయ ఉద్యోగిని హెచ్ 1బీ వీసా కింద అమెరికాకు తీసుకెళ్లింది. అక్కడ అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది. అతడి వీసా ఇంకా కొనసాగుతోందా లేదా అన్న విషయాన్ని కూడా అక్కడి ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులకు సమాచారం అందించలేదు. దీంతో.. అక్కడి కార్మిక శాఖ కంపెనీకి భారీ షాకిచ్చింది. 2019 జనవరి 1 నుంచి 2020 ఫిబ్రవరి 3వరకూ జీతం చెల్లించకుండా  నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ ఉద్యోగి తరఫున కంపెనీ నుంచి ఏకంగా రూ.63 లక్షలు వసూలు చేసింది.  ‘‘కంపెనీలు వీసాకు సంబంధించిన అన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఎటువంటి సందేహాలు ఉన్నా తక్షణం మమ్మల్ని సంప్రదించాలి.’’ అని కార్మిక శాఖ అధికారి ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-11-16T23:44:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising