ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు చట్టాల రద్దుపై US Lawmaker ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2021-11-20T19:00:11+05:30

కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతులు విజయం సాధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతులు విజయం సాధించారు. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏడాదికిపైగా సాగిన రైతుల ఆందోళన దేశ సరిహద్దులు దాటింది. వారి ఉద్యమానికి విదేశాల నుంచి కూడా భారీ మద్దతు లభించింది. తాజాగా భారత ప్రభుత్వం బ్లాక్ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో పలువురు విదేశీ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పోరాటం ముందు ప్రభుత్వం తలదించిందంటూ వారు పేర్కొంటున్నారు. తాజాగా అమెరికాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఆండీ లెవిన్ కూడా స్పందించారు.


ట్విటర్ వేదికగా మూడు సాగు చట్టాల రద్దుపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. "ఏడాదికి పైగా నిరసనల తర్వాత భారత్‌లో మూడు వ్యవసాయ చట్టాలు రద్దు కావడం హర్షనీయం. ఇది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కార్మికులు కలిసికట్టుగా పోరాడితే ఏ కార్పోరేట్ అయినా తలవంచక తప్పదని మరోసారి నిరూపితమైంది. ఇది ఒక్క ఇండియాకే కాదు, ప్రపంచం మొత్తానికి వర్తిస్తుంది" అని ఆండీ లెవిన్ ట్వీట్ చేశారు.    

Updated Date - 2021-11-20T19:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising