ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుద్ధిపోనిచ్చుకోని ట్రంప్.. వెళ్లేముందు ఘోర అవమానం !

ABN, First Publish Date - 2021-01-02T20:03:30+05:30

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వెళ్లేముందు ఘోర అవమానం ఎదురైంది. కీలక రక్షణ బిల్లుపై అభ్యంతరాలు చెబుతూ సంతకం చేయట్లేదని భావించిన కాంగ్రెస్.. ఆయన వీటో అధికారాన్ని తొలిసారి తిరగరాస్తూ బిల్లును పాస్ చేసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇలా జరగడం ఇదే మొదటిసారి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వెళ్లేముందు ఘోర అవమానం ఎదురైంది. కీలక రక్షణ బిల్లుపై అభ్యంతరాలు చెబుతూ సంతకం చేయట్లేదని భావించిన కాంగ్రెస్.. ఆయన వీటో అధికారాన్ని తొలిసారి తిరగరాస్తూ బిల్లును పాస్ చేసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇలా జరగడం ఇదే మొదటిసారి. సొంత రిపబ్లికన్ పార్టీ సభ్యులే ఆయన వీటోను తోసిపుచ్చడం గమనార్హం. దీంతో ట్రంప్‌నకు ఊహించని షాక్ తగిలింది. వీటో అధికారాన్ని తిరగరాసేందుకు ప్రవేశపెట్టిన బిల్లుకు సెనేట్ 81-13 ఓట్లతో ఆమోదించింది. ఇక సెనేట్ ఆమోదంతో వీటో బిల్లు చట్టంగా మారింది. ఫలితంగా 740.5 బిలియన్ డాలర్ల రక్షణ విధానానికి లైన్ క్లియర్ అయింది. 


ఈ బిల్లు ద్వారా లక్షలాది మంది అమెరికన్ సైనికులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందనున్నాయి. 'హజార్డస్ డ్యూటీ పే' కింద సైనికులకు ఇప్పటి వరకు చెల్లించిన నెలవారీ భృతి 250 డాలర్ల నుంచి 275 డాలర్లకు పెరగనుంది. అలాగే ఆయుధాల సమీకరణ కొనసాగనుంది. కాగా, వీటో అధికారాన్ని కోల్పోవడంపై ట్రంప్ మాట్లాడుతూ 'మెరుగైన రక్షణ బిల్లును ప్రతిపాదించే అవకాశాన్ని రిపబ్లికన్ సెనేట్ చేజార్చుకుందని' అన్నారు. 

Updated Date - 2021-01-02T20:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising