ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు వెళ్లొద్దు.. పౌరులకు అమెరికా సూచన!

ABN, First Publish Date - 2021-04-20T14:49:18+05:30

అగ్రరాజ్యం అమెరికా తమ దేశ పౌరులకు కీలక సూచన చేసింది. వివిధ కారణాలతో భారత్‌కు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న పౌరులు.. తమ ప్రయత్నాలను నిలిపివేయాలని కోరింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత పర్యటనను విరమించుకోవాలని పేర్కొంది. ఒకవేళ ఇండియా వెళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా తమ దేశ పౌరులకు కీలక సూచన చేసింది. వివిధ కారణాలతో భారత్‌కు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న పౌరులు.. తమ ప్రయత్నాలను నిలిపివేయాలని కోరింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత పర్యటనను విరమించుకోవాలని పేర్కొంది. ఒకవేళ ఇండియా వెళ్లడం తప్పనిసరి అయితే.. ప్రయాణానికి ముందు రెండు డోసుల కొవిడ్ టీకా తీసుకోవాలని సూచించింది.


‘భారత పర్యటనకు సిద్ధం అవుతున్న అమెరికా పౌరులందరూ తమ ప్రయత్నాలను విరిమించుకోవాలి. కొవిడ్ టీకా పొందిన వారికి కరోనా ప్రమాదం అంతగా ఉండనప్పటికీ.. సదరు ప్రయాణికులు భారత్‌కు వెళ్లకపోవడం మంచింది. అత్యవసర పనిలపై భారత్‌కు వెళ్లదలచుకునే వారు.. తప్పనిసరిగా వ్యాక్సిన్‌ను వేయించుకోండి’ అని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. యూరప్ దేశాల్లో కరోనా తీవ్రత దృష్ట్యా ఆయా దేశాలకు వెళ్లొందని అమెరికా.. తమ పౌరులకు గతంలో సూచించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా యూరప్, చైనా, బ్రెజిల్, ఇరాన్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే అమెరికాయేతరులను.. అగ్రరాజ్యం తమ దేశంలోకి అనుమతించలేదు. ఇదిలా ఉంటే.. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటికే బ్రిటన్ నిషేధం విధిస్తూ ప్రకటన విడుదల చేసింది. 


Updated Date - 2021-04-20T14:49:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising