ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి క‌బురు!

ABN, First Publish Date - 2021-06-25T17:37:19+05:30

హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న విదేశీ గెస్ట్​ వర్కర్ల‌కు యూఎస్​ సిటిజెన్​షిప్​ అండ్​ ఇమిగ్రేషన్​ సర్వీసెస్​(యూఎస్​సీఐఎస్​) తీపి క‌బురు అందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్ట‌న్‌: హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న విదేశీ గెస్ట్​ వర్కర్ల‌కు యూఎస్​ సిటిజెన్​షిప్​ అండ్​ ఇమిగ్రేషన్​ సర్వీసెస్​(యూఎస్​సీఐఎస్​) తీపి క‌బురు అందించింది. తిరస్క‌ర‌ణ‌కు గురైన వీరి వీసా అప్లికేష‌న్ల‌ను తిరిగి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఇచ్చింది. యూఎస్​సీఐఎస్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో అమెరికాలో ఉద్యోగం చేయాల‌నుకునే భార‌త ఐటీ నిపుణుల‌కు మ‌రో అవ‌కాశం ద‌క్కిన‌ట్లైంది. అయితే, ఈ అవ‌కాశం 2020 అక్టోబర్​1 తర్వాత వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్ర‌మే.​ వీరు మళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకుంటే పరిగణలోకి తీసుకుంటామని యూఎస్​సీఐఎస్ అధికారులు వెల్ల‌డించారు. అలాగే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు 2021, అక్టోబర్​ 1 వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. ఇక‌ అగ్ర‌రాజ్యంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్‌-1బీ వీసా ద్వారా ప్ర‌తి ఏటా అక్క‌డి ఐటీ కంపెనీలు వేల సంఖ్యలో  విదేశీ నిపుణుల‌ను నియ‌మించుకుంటున్నాయి. వీరిలో అధికంగా భారతీయులు, చైనీయులు ఉంటున్నారు. 


Updated Date - 2021-06-25T17:37:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising