ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిపబ్లికన్ నేతల బండారం బట్టబయలు.. నాన్సీ పెలోసి అసహనం!

ABN, First Publish Date - 2021-05-22T00:15:28+05:30

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యుల వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులను, సిబ్బందిని రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ప్రమాదంలోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యుల వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులను, సిబ్బందిని రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొవిడ్ మహమ్మారి కారణంగా అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ప్రభావితమైంది. ఇతర ఏ దేశంలో కూడా అమెరికాలో జరిగినంత ప్రాణ నష్టం జరగలేదు. ఈ క్రమంలో అగ్రరాజ్య అధినేత జో బైడెన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. లక్ష్యాలు నిర్దేశించుకునీ మరీ.. ప్రజలకు టీకాలు అందే ఏర్పాట్లు చేశారు. దీంతో వ్యాక్సినేషన్ ఊపందుకుంది. కోట్లాది మంది ప్రజలు టీకా వేయించుకున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు.. మాస్క్ ధరించాల్సిన అవసరం లేదంటూ సీడీసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓ సర్వే రిపబ్లికన్ పార్టీకి చెందిన నేతల గురించి విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. 



డెమొక్రాటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులందరూ టీకా వేయించుకోగా.. రిపబ్లికన్ పార్టీ చెందిన వారు మాత్రం టీకా వేయించుకునేందకు ముందుకు రాలేదని వెల్లడైంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుల్లో కేవలం 44.8 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని సర్వేలో వెల్లడైంది. ఈ క్రమంలో యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పందించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. ‘రిపబ్లికన్ పార్టీకి చెందిన చాలా మంది చట్టసభ సభ్యులు కొవిడ్ టీకాను తీసుకోలేదు. వీరంతా వ్యాక్సిన్ తీసుకున్న ఇతర సభ్యుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారారు. యూఎస్ కాంగ్రెస్‌లో పని చేసే సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను కూడా రిస్క్‌లో పడేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చట్టసభ్యులందరూ వ్యాక్సిన్ తీసుకునే వరకూ సభలో ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని ఆమె స్పష్టం చేశారు. 


Updated Date - 2021-05-22T00:15:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising