ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంత దిగజారుడా.. ఆస్ట్రేలియాపై మండిపడ్డ ఫ్రాన్స్

ABN, First Publish Date - 2021-11-04T03:08:07+05:30

జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ దేశాధినేత ఆస్ట్రేలియా ప్రధానికి పంపిన ఎస్ఎమ్ఎస్ లీక్ కావడం పట్ల ఫ్రాన్స్ అగ్గిమీద గుగ్గిలమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ దేశాధినేత ఆస్ట్రేలియా ప్రధానికి పంపిన ఎస్ఎమ్ఎస్ లీక్ కావడం పట్ల ఫ్రాన్స్ అగ్గిమీద గుగ్గిలమైంది. ఇంతటి దిగజారుడు తనాన్ని మునుపెన్నడూ చూడలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. డీజిల్ జలాంతర్గాముల కొనుగోలు  కోసం ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ఇటీవల రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికా నుంచి అణుజలాంతర్గాములు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిన ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే..ఈ విషయంలో ఆస్ట్రేలియా తమకు అసత్యాలు చెప్పారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత కొద్ది రోజులకే..ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆస్ట్రేలియా ప్రధానికి పంపింన మేసేజీ లీకై కలకలం సృష్టించింది. ఆ మేసేజీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు.. మాకు గుడ్ న్యూస్ వస్తుందా లేక బ్యాడ్ న్యూస్ వస్తుందా అని ఆస్ట్రేలియా ప్రధానికి అడిగినట్టు ఉంది. దీంతో.. ఫ్రాన్స్‌కు విషయం ముందే తెలుసన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ ప్రభుత్వం మండిపడుతోంది. మిత్రదేశాల అధ్యక్షుల మధ్య జరిగిన రహస్య సంభాషణ కూడా ఇలా జరుగుతుందని మునుపెన్నడూ చూడలేదు. అంటూ ఆస్ట్రేలియాలోని ఫ్రాన్స్ రాయబారీ మండిపడ్డారు. 

Updated Date - 2021-11-04T03:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising