ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ దేశాల ప్రయాణికులకు కరోనా పరీక్షల వ్యయాన్ని తగ్గించిన బ్రిటన్

ABN, First Publish Date - 2021-08-15T17:33:15+05:30

అంతర్జాతీయ ప్రయాణికులకు చేసే కరోనా పరీక్షల వ్యయం విషయంలో బ్రిటన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: అంతర్జాతీయ ప్రయాణికులకు చేసే కరోనా పరీక్షల వ్యయం విషయంలో బ్రిటన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్ లిస్ట్ లేదా అంబర్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షల ఖర్చును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దేశాల ప్రయాణికులకు కోవిడ్ టెస్టుల వ్యయాన్ని 88 పౌండ్స్(రూ.9వేలు) నుంచి 65 పౌండ్స్(రూ.7వేలు)కు తగ్గించింది. అలాగే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు పీసీఆర్ టెస్టు కోసం కేవలం 20 పౌండ్స్(రూ.2058) చెల్లిస్తే సరిపోతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇక ఇటీవల భారత్‌ను కూడా యూకే అంబర్ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే.


దీంతో బ్రిటన్ వెళ్లే భారత ప్రయాణికులకు కరోనా పరీక్షల ఖర్చు విషయంలో కొంత ఉపశమనం లభించినట్లైంది. కాగా, అంతర్జాతీయ ప్రయాణికులు ఇంగ్లండ్ చేరిన తర్వాత 2వ రోజు, 8వ రోజు రెండు పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఈ రెండు పరీక్షలకు కలిపి ఇంతకుముందు 170 పౌండ్స్(రూ.17,493) ఉంటే.. తాజాగా తగ్గించిన తర్వాత 136 పౌండ్స్(రూ.13,994) అవుతుందని అధికారులు తెలిపారు. అయితే, రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చేవారికి కరోనా టెస్టుల వ్యయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆరోగ్య, సామాజిక సంరక్షణ విభాగం (డీహెచ్‌ఎస్‌సీ) వెల్లడించింది. 


Updated Date - 2021-08-15T17:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising