ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌పై అగ్గిమీద గుగ్గిలమవుతున్న భారతీయులు..!

ABN, First Publish Date - 2021-10-06T03:24:15+05:30

బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాల పట్ల భారతీయుల్లో ఆగ్రహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సమయంలో ప్రయాణాలకు సంబంధించి బ్రిటన్‌లో కొత్త నిబంధనలు సోమవారం నుంచీ అమల్లోకి వచ్చాయి. దాదాపు 50 దేశాల ప్రయాణికుల విషయంలో బ్రిటన్ సడలింపులు ప్రకటించింది. కరోనా పరీక్షలు, తప్పనిసరి క్వారంటైన్ వంటి అనేక నిబంధనల విషయంలో ఆయా దేశాల ప్రయాణికులకు మినహాయింపులు ఇచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్న దేశాలకు ఈ మినహాయింపులు ఇస్తామని కూడా బ్రిటన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే.. భారతీయుల్లో మాత్రం బ్రిటన్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. 


శుక్రవారం నాడు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొన్న కొత్త రూల్స్ ప్రకారం.. భారత్‌లో టీకా కార్యక్రమానికి బ్రిటన్‌లో గుర్తింపు లేదు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా బ్రిటన్‌‌కు దీటుగా జవాబిచ్చింది. భారత్‌కు రావాలనుకుంటున్న బ్రిటన్ పౌరులు తప్పనిసరిగా కరోనా టెస్టు రిపోర్టులు చూపించాలని, భారత్‌కు చేరుకున్నాక పది రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాలనీ స్పష్టం చేసింది. బ్రిటన్‌లో భారత ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలనే ఇక్కడికొచ్చే బ్రిటన్‌ పౌరులకూ వర్తింపజేసింది. అయితే.. భారత టీకా కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేనంత విస్తృతస్థాయిలో జరుగుతోందని, కాబట్టి.. భారత టీకా కార్యక్రమాన్ని బ్రిటన్ ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తించాలనే డిమాండ్లు ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-10-06T03:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising