ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UK తప్పుడు కేసులో మహిళ అరెస్ట్... అత్యాచారం.. ఆపై హత్య..

ABN, First Publish Date - 2021-09-30T03:06:43+05:30

బ్రిటన్‌ను కుదిపేస్తున్న యువతి హత్యాచారం కేసు.. కోర్టు ముందుకు షాకింగ్ నిజాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: అతడు ప్రజల మానప్రాణాలను కాపాడాల్సిన పోలీస్ ఆఫీసర్. కానీ.. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఆమెను చూడగానే అతడిలో మృగం నిద్రలేచింది. వెంటనే ఆమెను కరోనా నిబంధనలు ఉల్లంఘించావంటూ అరెస్టు చేశాడు. అప్పటికి అతడు సివిల్ దుస్తుల్లో ఉన్నప్పటికీ అతడు చెప్పిన మాటలు, చూపించిన వారెంటీ కార్డుతో ఆమె మోసపోయింది. ఈ క్రమంలో ఓ ట్యాక్సీలో ఆమెను మరోప్రదేశానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెను అనుభవించి ఆపై హత్య చేశాడు. లండన్‌లో మార్చి 3న జరిగిన ఈ దారుణం అప్పట్లో బ్రిటన్‌లో సంచలనం కలిగించింది. కాగా.. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న కోర్టుకు ప్రాసిక్యుషన్ వారు బుధవారం  ఈ వివరాలను వెల్లడించారు. 


నిందితుడు వెయిన్ కొజెన్స్‌కు ఏ శిక్ష వేయాలనేదానిపై గురువారం తీర్పు వెలువరిస్తామని కోర్టు పేర్కొంది. వెయిన్ తాను చేసిన నేరాన్ని జులైలో అంగీకరించాడు. నిందితుడు ఆమెను అరెస్టు చేస్తున్నప్పటి దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితురాలిని ఓ ట్యాక్సీలో తరలిస్తుండటాన్ని  కారులో వెళుతున్న మరో జంట కూడా చూసింది. వారు ఈ విషయాన్ని కోర్టుకు వెల్లడించారు. మఫ్టీలో ఉన్న పోలీసు అరెస్టు చేస్తున్నట్టు అప్పుడు తాము అనుకున్నట్టు వారు పేర్కొన్నారు. కాగా.. బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ కూడా ఇదే విషయాన్ని న్యాయస్థానానికి తెలిపాడు. ఆమె చాలా తెలివిగలదని, నిందితుడు స్వయానా ఓ పోలీసు కావడంతో ఆమెకు అనుమానం రాకుండా అరెస్టు చేసి ఉండొచ్చని తెలిపాడు. కాగా.. గురువారం న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించనుంది.   

Updated Date - 2021-09-30T03:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising