ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో కొత్త రోడ్ సెఫ్టీ కార్యక్రమం..

ABN, First Publish Date - 2021-01-15T13:26:39+05:30

గల్ఫ్ దేశం యూఏఈలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కొత్త రోడ్ సెఫ్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: గల్ఫ్ దేశం యూఏఈలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కొత్త రోడ్ సెఫ్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా వాహనాల టైర్ల విషయంలో యజమానాలు బాధ్యతరాహిత్యంగా ఉండడం వల్ల ఇటీవల కాలంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు గ్రహించిన పోలీసులు ఈ విషయమై కఠినంగా వ్యవహరించే దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఇలా వాహనాల టైర్ల విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల ఇతర రోడ్డు వినియోగదారుల భద్రతకు గొప్ప ప్రమాదం అని అబుధాబిలోని ట్రాఫిక్ అధికారులు హెచ్చరించారు. కనుక ఇంట్లోంచి బయల్దేరే ముందు ఒకటికి రెండుసార్లు వాహనాల టైర్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. 


ఇకపై వాహనదారులు కాలం చెల్లిన, నాణ్యతలేని టైర్లు, అలాగే వాటిని సరిగ్గా బిగించకపోవడం వంటి కారణాలతో బయట పట్టుబడితే 500 దిర్హమ్స్(సుమారు రూ.10వేలు) జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లతో పాటు ఒక వారం రోజుల పాటు వాహనం స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కనుక స్పెసిఫికేషన్లకు అనుగుణంగా నాణ్యమైన టైర్లను ఉపయోగించడంతో పాటు అవి ఎల్లప్పుడూ మంచి కండిషన్‌లో ఉండేలా చూసుకోవాలని పోలీసులు డ్రైవర్లకు సూచించారు. వాహనదారులు ప్రయాణానికి ముందు కచ్చితంగా టైర్లను సరిగ్గా చెక్ చేసిన తర్వాతే బయటకు రావాలని, ముఖ్యంగా హైవేలపై పేర్కొన్న వేగ పరిమితికి లోబడి వాహనాలు డ్రైవ్ చేయాలని తెలిపారు.  

Updated Date - 2021-01-15T13:26:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising