ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయు సంఖ్య ఎంతంటే!

ABN, First Publish Date - 2021-01-18T16:52:41+05:30

ప్రవాస భారతీయులకు యూఏఈ ఓ ఇల్లులా మారిందని ఐక్యరాజ్య సమతి అభిప్రాయపడింది. ప్రవాస భారతీయుల సంఖ్య యూఏఈలో అత్యధికంగా ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు యూనైటెడ్ నేషన్స్ ఓ నివేదికను వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులకు యూఏఈ ఓ ఇల్లులా మారిందని ఐక్యరాజ్య సమతి అభిప్రాయపడింది. ప్రవాస భారతీయుల సంఖ్య యూఏఈలో అత్యధికంగా ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు యూనైటెడ్ నేషన్స్ ఓ నివేదికను విడుదల చేసింది. ‘ఇంటర్నేషనల్ మైగ్రేషన్ 2020 హైలెట్స్’ పేరిట విడుదల చేసిన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 18 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నట్టు వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 3.5 మిలియన్ల మంది ఒక్క యూఏఈలో ఉన్నట్టు తెలిపింది. యూఏఈ తర్వాత అగ్రరాజ్యం అమెరికాలోనే ప్రవాస భారతీయ సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. ప్రవాస భారతీయుల సంఖ్య యూఎస్‌లో 2.7 మిలియన్లు, సౌదీ అరేబియాలో 2.5 మిలియన్లు ఉన్నట్టు యూనైటెడ్ నేషన్స్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా యూనైటెడ్ నేషన్స్‌లో పాపులేషన్ అఫైర్స్ ఆఫీసర్‌ క్లేర్ మెనోజ్జి మాట్లాడుతూ.. ‘అత్యధిక జనాభాను కలిగిన దేశాల్లో భారతదేశం ఒకటి. ఈ దేశం నుంచి దాదాపు 18 మిలియన్ల మంది విదేశాలకు వలస వెళ్లారు. నిజానికి ఇది చాలా పెద్ద సంఖ్య. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-18T16:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising