ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ 7 దేశాల వారి ఎంట్రీపై UAE బ్యాన్.. విమాన సర్వీసులు కూడా బంద్!

ABN, First Publish Date - 2021-11-27T14:39:52+05:30

కరోనా కొత్త వేరియంట్ ‘ఒమైక్రాన్‌’ నేపథ్యంలో యూఏఈ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమైక్రాన్‌’ నేపథ్యంలో యూఏఈ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వేరియంట్ ప్రభావం ఆఫ్రికా దేశాలపై అధికంగా ఉండడంతో అక్కడి ఏడు దేశాల ప్రయాణికులు యూఏఈలో ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు శుక్రవారం యూఏఈ కీలక ప్రకటన చేసింది. దక్షిణాఫ్రికా, నమీబియా, లెసోతో, ఈశ్వతిని, జింబాబ్వే, బోట్స్వానా, మొజాంబిక్ దేశాల పౌరులు యూఏఈలోకి ప్రవేశించకుండా బ్యాన్ విధిస్తునట్లు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, నేషనల్ అథారిటీ ఫర్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రకటించాయి. అలాగే ఈ దేశాల నుంచి ట్రాన్సిట్ విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులపై కూడా నిషేధం విధించాయి. నవంబర్ 29 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించాయి. 


అయితే, యూఏఈ నుంచి ఈ నిషేధిత దేశాలకు విమాన సర్వీసులకు మాత్రం అనుమతించాయి. దీంతోపాటు ఏడు దేశాల దౌత్యాధికారులు, యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాలు కలిగిన వారికి ఈ నిషేధం నుంచి మినహాంపు ఇచ్చాయి. కాకపోతే వీరు యూఏఈ బల్దేరడానికి 6 గంటల ముందు విమానాశ్రయంలో పీసీఆర్ కరోనా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే యూఏఈ చేరుకున్న తర్వాత మరోసారి ఎయిర్‌పోర్టులో టెస్టు ఉంటుంది. ఇక యూఏఈ వచ్చిన తర్వాత 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి. తొమ్మిదో రోజు మళ్లీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ నిషేధిత దేశాలకు చెందిన ప్రయాణికులు యూఏఈ రావాలనుకుంటే 14 రోజుల పాటు వేరే దేశంలో స్టే చేయాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్లకు యూఏఈలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు.


యూఏఈ పౌరులు దక్షిణాఫ్రికా, నమీబియా, లెసోతో, ఈశ్వతిని, జింబాబ్వే, బోట్స్వానా, మొజాంబిక్ వెళ్లకూడదు. ఇప్పటికే ఈ ఏడు దేశాలకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న వారికి వెంటనే విమానయాన సంస్థలు సమాచారం అందించాలని యూఏఈ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే యూఏఈ నేషనల్ క్యారియర్స్ ఎమిరేట్స్, ఎతిహాద్‌లు నిషేధిత దేశాలకు విమాన సర్వీసులను క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్, డర్బన్ నుంచి దుబాయ్‌కు వచ్చే విమాన సర్వీసులను 29వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ప్రకటించింది. అటు ఎతిహాద్ కూడా ఈ నెల 30 నుంచి జోహన్నెస్‌బర్గ్ సర్వీస్‌ను నిలిపివేసింది. యూఏఈ బాటలోనే సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైత్ కూడా ఆయా దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేశాయి.

Updated Date - 2021-11-27T14:39:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising