ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా చట్టసభ సభ్యురాలి ఖాతాను సస్పెండ్ చేసిన ట్విటర్

ABN, First Publish Date - 2021-01-18T23:26:17+05:30

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నెలకొన్న హింస తరువాత ట్విటర్ సంస్థ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నెలకొన్న హింస తరువాత ట్విటర్ సంస్థ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రిపబ్లిక్ పార్టీ నుంచి చట్టసభ సభ్యురాలిగా ఉన్న మార్జరీ టేలర్ గ్రీనీ ట్విటర్ ఖాతాను సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో జార్జియాలో ఓటర్ ఫ్రాడ్ జరిగిందంటూ మార్జరీ సంచలన ఆరోపణలు చేశారు. తమ సంస్థ నిబంధలను మార్జరీ ఉల్లంఘించడం కారణంగానే ఆమె ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్టు సంస్థ వెల్లడించింది. 


ట్విటర్ తన ఖాతాను సస్పెండ్ చేయడం పట్ల మార్జరీ మండిపడ్డారు. అన్యాయంపై గళం విప్పే తన లాంటి వాళ్లను ట్విటర్ అణచివేస్తోందని ఆరోపించారు. కాగా.. అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జో బైడెన్ ప్రమాణ స్వీకారం రోజు సంస్థ నిబంధనలను ఉల్లంఘించే ఖాతాలను ట్విటర్ సస్పెండ్ చేయనుంది. ట్విటర్ ఖాతాల ద్వారా ఎటువంటి హింస జరగకుండా ఉండేలా చర్యలను తీసుకుంటోంది.

Updated Date - 2021-01-18T23:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising