ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coronaపై పోరులో భారత్‌కు ట్విటర్ భారీ సాయం!

ABN, First Publish Date - 2021-05-11T17:57:39+05:30

కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు తమ వంతు సాయం చేస్తూ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు తమ వంతు సాయం చేస్తూ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పలు అంతర్జాతీయ సంస్థలు సైతం కరోనాతో అల్లాడుతున్న ఇండియాను ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. తాజాగా భారత్​కు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది.​ మూడు స్వచ్ఛంద సంస్థలకు కలిపి 15 మిలియన్ల డాలర్ల(భారత కరెన్సీలో దాదాపు రూ. 110కోట్లు) ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ నిధులను తాత్కాలిక కరోనా కేంద్రాల ఏర్పాటు, మెడిసిన్స్ కొనుగోలు, వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ సరఫరా కోసం వినియోగించాలని కోరింది. ఈ విరాళాన్ని దేశంలో కొవిడ్‌ సేవలు అందిస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థల ద్వారా అందివ్వనున్నట్లు ట్విటర్ సీఈఓ జాక్‌ ప్యాట్రిక్ డోర్సె సోమవారం తెలిపారు. ఎయిడ్‌ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్​ఏ, వైల్‌ కేర్‌ సంస్థల ద్వారా ఈ నిధులు ఖర్చు పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటిలో వైల్‌ కేర్‌ సంస్థకు 10 మిలియన్లు కేటాయించగా.. ఎయిడ్‌ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్​ఏలకు చెరో 2.5 మిలియన్లు ఇస్తున్నట్లు చెప్పారు.



Updated Date - 2021-05-11T17:57:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising