ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కవల పిల్లలు చనిపోయారని చెప్పిన వైద్యుడు.. స్మశానానికి తీసుకెళ్తుండగా..

ABN, First Publish Date - 2021-01-13T18:05:04+05:30

ప్రాణాలతో ఉన్న పసిపిల్లలు చనిపోయినట్టు చెప్పిన వైద్యుడికి బహ్రెయిన్ క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనామా: ప్రాణాలతో ఉన్న పసిపిల్లలు చనిపోయినట్టు చెప్పిన వైద్యుడికి బహ్రెయిన్ క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో మరో ఇద్దరికి ఏడాది పాటు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. బహ్రెయిన్‌లోని సాల్మానియా మెడికల్ కాంప్లెక్స్(ఎస్‌ఎంసీ) వైద్యుడు అప్పుడే పుట్టిన కవల పిల్లలు మరణించినట్టు తల్లిదండ్రులకు చెప్పాడు. తమ పిల్లలు పుట్టగానే చనిపోయారని అనుకున్న తల్లిదండ్రులు అంత్యక్రియలు చేసేందుకు స్మశానానికి వెళ్తుండగా ఒక బిడ్డ కదిలింది. 


వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఒక బిడ్డ బతికే ఉందంటూ తల్లిదండ్రులు వైద్యులతో చెప్పారు. వైద్యులు వెంటనే చికిత్స మొదలుపెట్టగా.. చికిత్స పొందుతూ కొద్ది గంటల తర్వాత ఆ బిడ్డ కూడా మరణించింది. దీంతో వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు మరణించారని తల్లిదండ్రులు కోర్టులో కేసు వేశారు. వైద్యుడు వైద్య వృత్తిలోని నైతికతను దుర్వినియోగం చేయడమే కాకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్టు కోర్టు గుర్తించింది. అతడికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. 

Updated Date - 2021-01-13T18:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising