ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో హాట్ కేకుల్లా ట్రంప్ విగ్రహాలు!

ABN, First Publish Date - 2021-03-13T02:57:52+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విగ్రహాల కోసం చైనా ప్రజలు ఎగబడుతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి మరీ.. ట్రంప్ విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బుద్ధుడి మాదిరి రెండు చే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విగ్రహాల కోసం చైనా ప్రజలు ఎగబడుతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి మరీ.. ట్రంప్ విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బుద్ధుడి మాదిరి రెండు చేతులను ఒళ్లో పెట్టుకుని, కళ్లు మూసికుని ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్న ట్రంప్ విగ్రహాలు చైనా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో దర్శనమిస్తున్నాయి. దీంతో చైనా ప్రజలు వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 4.6 మీటర్ల ఎత్తైన విగ్రహాలను కొనేందుకు 3,999యువాన్‌లు (ఇండియన్ కరెన్సీలో రూ.45వేలు) ఖర్చు చేస్తుండగా.. 1.6 మీటర్ల ఎత్తైన విగ్రహాల కోసం దాదాపు రూ. 11వేలను వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ విగ్రహాలను ఆన్‌లైన్ అమ్మకానికి పెట్టిన వ్యాపారి స్పందించారు. తొలుత 100 విగ్రహాలను తయారు చేయించి.. ‘మీ కంపెనీ మళ్లీ గొప్పగా మార్చుకొండి’ అనే స్లోగన్‌తో ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్టు వివరించారు. ఈ క్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఇప్పటికే చాలా విగ్రహాలు అమ్ముడుపోయినట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ విగ్రహాన్ని ఫన్ కోసం కొనుగోలు చేసినట్టు ఓ కస్టమర్ పేర్కొన్నాడు. కాగా.. కరోనా విషయంలో చైనాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 




Updated Date - 2021-03-13T02:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising