ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ట్రాన్స్‌జెండర్‌కు కీలక పదవి !

ABN, First Publish Date - 2021-03-25T13:54:08+05:30

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదైంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది జో బైడెన్ సర్కార్. శిశువైద్యురాలు, ట్రాన్స్‌జెండర్ మహిళ రాచెల్ లెవిన్‌ను బైడెన్ ఆరోగ్య సహాయ కార్యదర్శిగా ఆమోదిస్తూ బుధవారం సెనేట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పెన్సిల్వేనియా ఆరోగ్య శాఖ చీఫ్ అయిన రాచెల్‌ను ఈ ఏడాది జనవరిలో బైడెన్ ఈ కీలక పదవికి నామినేట్ చేశారు. బుధవారం రాచెల్ నామినేషన్ నిర్ధారించేందుకు సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించారు. దీంతో రాచెల్‌ను 52-48 ఓట్ల తేడాతో సెనేట్‌ ఆమోదం తెలిపింది. ఇక తనకు దక్కిన ఈ కీలక పదవి పట్ల ఆనందం వ్యక్తం చేసిన రాచెల్.. 5.45 లక్షల మంది అమెరికన్లను పొట్టనబెట్టుకున్న మహమ్మారిపై పోరునే తన తొలి లక్ష్యంగా పేర్కొన్నారు.  

Updated Date - 2021-03-25T13:54:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising